తెలంగాణ
నేను రెడీ.. నువ్వు సిద్ధమా? కేటీఆర్‌కు దానం ఓపెన్ సవాల్
ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఓపెన్ సవాల్ విసిరారు.గురువారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో చేపట్టిన ‘సేవ్ డెమోక్రసీ’ ర్యాలీకి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో తనపై బరిలోకి దిగి పోటీ చేయాలని కేటీఆర్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.ఉపఎన్నికకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని, ఈ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకుందామన్నారు. దానం నాగేందర్ అంటేనే ఓ బ్రాండ్ అని ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ ఉపఎన్నిక కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు రెఫరెండం కాబోతోందని సంచలన కామెంట్స్ చేశారు.
