తెలంగాణ

Hyderabad Traffic: హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లు కడుతున్నా.. ట్రాఫిక్ కష్టాలు ఎందుకు తీరట్లేదు?

Hyderabad Traffic: భాగ్యనగరంలో ఎటు చూసినా కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, విశాలమైన వంతెనలు కనిపిస్తున్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వరుసగా వంతెనలు నిర్మిస్తున్నా, వాహనదారులకు మాత్రం ట్రాఫిక్ నరకం తప్పడం లేదు. ఒక జంక్షన్ దాటేసరికి మరో జంక్షన్ వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోతున్నాయి. అసలు ఇన్ని ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తున్నా, హైదరాబాద్ రోడ్లపై రద్దీ ఎందుకు తగ్గడం లేదు? క్షేత్రస్థాయిలో అసలు లోపం ఎక్కడుంది?ఫ్లైఓవర్లు నిర్మించడం వల్ల ఆ ఒక్క కూడలి వద్ద సిగ్నల్ లేకుండా వాహనాలు వేగంగా ముందుకు వెళ్తున్నాయి. కానీ, ఫ్లైఓవర్ దిగగానే ముందుకు వెళ్లే రోడ్డు ఇరుకుగా ఉండటం లేదా అక్కడ మరో సిగ్నల్ ఉండటంతో మళ్లీ వాహనాలన్నీ ఒకేచోట గుమిగూడుతున్నాయి.