తెలంగాణ
Hyderabad: ప్రజా రవాణా మెరుగుదలపై రేవంత్ సర్కార్ ఫోకస్.. సమీక్షలో కీలక సూచనలు!..
క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలు భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా మెరుగుపర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. క్యూర్ పరిధిలో ప్రజా రవాణా మెరుగు, వివిధ రహదారుల అనుసంధానత, రీసైకిల్డ్ వాటర్ వినియోగంపై శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. నగరంలో విపరీతమైన రద్దీ ఉన్న ప్రాంతాల్లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (PRT) సిస్టమ్ ఏర్పాటుకు అవసరమైన అంశాలపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
