తెలంగాణ
సెలబ్రిటీల చుట్టూ ఈడీ ఉచ్చు.. జాబితాలో ప్రముఖులు!..
హైదరాబాద్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా టాలీవుడ్ నటి నిధి అగర్వాల్ బుధవారం హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి హాజరయ్యారు. ఈడీ అధికారులు ఆమె స్టేట్‌మెంట్‌ను నమోదు చేస్తున్నారు. మరోవైపు బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించినట్టు సమాచారం. ముఖ్యంగా ప్రచారాల ద్వారా జరిగిన చెల్లింపులు, వాటి ఆర్థిక మార్గాలు, హవాలా కోణం వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంలో సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రమోషన్లపై కూడా దర్యాప్తు జరుగుతోందని సమాచారం.
