తెలంగాణ

HYD: నగరంలో తాగునీటి తిప్పలు.. ప్రత్యామ్నాయాలపై జలమండలి కసరత్తు!

హైదరాబాద్ మహా నగరంలో భానుడి ప్రతాపానికి తోడు భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడంతో రానున్న రోజుల్లో తీవ్రమైన తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జలమండలి (HMWS&SB) మేనేజింగ్ డైరెక్టర్ (MD) అశోక్ రెడ్డి బాంబు పేల్చారు. రాబోయే 8 నెలల సుదీర్ఘ కాలం పాటు మంజీరా, సింగూరు ప్రాజెక్టుల నుంచి నీటి లభ్యత లేనందున, ఆ ప్రాజెక్టుల నీటి సాయం లేకుండానే మహానగర ప్రజల నీటి అవసరాలను తీర్చాల్సి వస్తుందని వెల్లడించారు. అయితే నీటి వనరులు క్రమంగా క్షీణిస్తుండటంతో జలమండలి అధికారులు ముందస్తు చర్యలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.