International
ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లు సహా ఎనిమిది మంది దుర్మరణం!
అమెరికాలోని పశ్చిమ అలస్కాలో పెను విషాదం చోటుచేసుకుంది. అత్యంత మారుమూల ప్రాంతంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో పాటు మొత్తం ఎనిమిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలను నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) బోర్డు ఛైర్మన్ క్లింట్ జాన్సన్ మీడియాకు వెల్లడిస్తూ అధికారికంగా ధ్రువీకరించారు. యాంకరేజ్ ప్రాంతం నుంచి కేప్ న్యూన్హామ్ వైపు రెండు ఇంజిన్లతో కూడిన సెస్నా చార్టర్ విమానం తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
