ఏపీ

హాలిడేస్ ఎఫెక్ట్.. శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది.వరుసగా సెలవులు రావడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో శ్రీవారి హుండీకి నిధుల వరద ప్రవాహం కొనసాగింది. గత 9 నెలల వ్యవధిలోనే స్వామి వారి హుండీకి రూ.1,129.04 కోట్ల భారీ ఆదాయం సమకూరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వర్గాలు వెల్లడించాయి. దేశవిదేశాల నుంచి విచ్చేసిన లక్షలాది మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో స్వామి వారి మీద అనంత భక్తితో హుండీలో కానుకలను సమర్పించారు. సమ్మర్ హాలిడేస్, పండుగల సెలవులు కలిసి రావడంతో గత కొన్ని నెలలుగా హుండీ ఆదాయం నిరంతరాయంగా సరికొత్త గరిష్టాలను నమోదు చేసింది. జూలై నెలలో టీటీడీ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో అత్యధికంగా రూ.140.25 కోట్ల కానుకలు రావడం విశేషం.