National

ఢిల్లీలో హై అలెర్ట్.. కీలక మెట్రోస్టేషన్ల మూసివేత

దేశరాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు పిలుపునివ్వడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నీట్ పేపర్ లీకేజీ సమయంలో జరిగిన ఉద్రిక్తతలు మరోసారి రిపీట్ కాకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కీలకమైన 11 మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ (రాకపోకల) గేట్లను తాత్కాలికంగా మూసివేసింది. ఎన్నికల సంఘం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే మరోసారి దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నేడు గాంధీ జయంతి సందర్భంగా నిరసన చేపడతామని ముందే ప్రకటించారు. ఈ మేరకు యువత మరోసారి నడుం బిగించాలని కోరారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ ‌కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), ఇతర శ్రేణులు సైతం జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనలకు పిలుపునిచ్చాయి.