National
Heavy Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్!
బంగాళాఖాతంలో రూపుదిద్దుకున్న అల్పపీడన వ్యవస్థ వేగంగా బలపడుతుండటంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీని ప్రభావంతో తూర్పు, మధ్య, ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో వర్షాల తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలకు భద్రతాపరంగా 'రెడ్ అలర్ట్' ప్రకటించారు. అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రానికి 'ఆరెంజ్ అలర్ట్'ను జారీ చేశారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ పశ్చిమ బెంగాల్ తీరం, బంగ్లాదేశ్ సరిహద్దుల వైపుకు కదులుతోంది.
