Health
Health: బెండకాయలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?..
మన వంటింట్లో తరచుగా కనిపించే బెండకాయ కేవలం రుచికోసం మాత్రమే కాదు.. శరీరానికి అవసరమైన పలు పోషకాలను అందించే కూరగాయల్లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా బెండకాయలో పీచు, విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్ వంటి పోషకాలు, అలాగే యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా బెండకాయలో ఉండే పీచు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడటంతో పాటు.. ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. అందువల్ల సమతుల్య ఆహారంలో బెండకాయను చేర్చుకోవచ్చని వారు సూచిస్తున్నారు.
