Spirituality
Health: చర్మంపై పులిపిర్లు వస్తున్నాయా..? ఆయుర్వేదంలో ఏం చెబుతున్నారు?
చర్మంపై కనిపించే చిన్న చిన్న పులిపిర్లు చాలామందికి సాధారణ సమస్యగానే అనిపిస్తాయి. కానీ ప్రతి పులిపిరి ఒకే రకమైనది కాదు. కొన్ని వైరస్ వల్ల వచ్చే వార్ట్స్ అయితే.. మరికొన్ని స్కిన్ ట్యాగ్స్ కావచ్చు. అందుకే పులిపిరి కనిపించగానే ఏదో ఒక ఇంటి చిట్కాతో కాల్చేయడం లేదా రాల్చేయడం సరైన పద్ధతి కాదు.
ఆయుర్వేదంలో చర్మ సమస్యలను కేవలం పైపైన కనిపించే లక్షణం ఆధారంగా కాకుండా, దోషాలు, ధాతువులు, లక్షణాలు, రోగి పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని చికిత్స చేయాలని ఆయుష్కు చెందిన ఆయుర్వేద గ్రంథాధారిత సమాచారంలో పేర్కొంటారు. కొన్ని పరిస్థితుల్లో లేపనం, క్షారకర్మ వంటి స్థానిక చికిత్సా విధానాలు కూడా ప్రస్తావించబడ్డాయి. అయితే క్షారకర్మ అంటే ఇంట్లో సున్నం లేదా ఇతర క్షార పదార్థాలు కలిపి పులిపిరిపై రాసుకోవడం కాదు. అది వైద్య పర్యవేక్షణలో నిర్వహించే చికిత్సా విధానం.
