తెలంగాణ

పండుగ వేళ పల్లెబాట.. హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్‌ జామ్!

 దసరా పండుగ శరవేగంగా సమీపిస్తున్న తరుణంలో భాగ్యనగరంలో పండుగ సందడి నెలకొంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా దసరా వేడుకలు జరుపుకునేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున స్వగ్రామాలకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు, విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రారంభం కావడంతో ఒక్కసారిగా రద్దీ విపరీతంగా పెరిగింది.  నగరం నుంచి బయటకు వెళ్లే ప్రధాన మార్గాలన్నింటిలోనూ వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా మియాపూర్‌ నుంచి బాలానగర్‌ వై జంక్షన్‌ వరకు కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.