Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టినా, ప్రలోభ పెట్టినా తలొగ్గని నాయకుడు పెద్ది- హరీశ్ రావు
Harish Rao: వరంగల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రతి ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర చాలా కీలకం అని చెప్పారు. పెద్దితో నేను పాల్గొన్న పురాతన దేవాలయం చివరి కార్యక్రమం అని, అదే చివరిది అవుతుందని అనుకోలేదని వాపోయారు. సాధారణ జీవితం గడిపిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టినా, ప్రలోభ పెట్టినా తలొగ్గని నాయకుడు పెద్ది అని కీర్తించారు. పెద్దిని బతికించడం కోసం కేసీఆర్ చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదన్నారు. పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు హరీశ్ రావు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లలో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏ మెడికల్ కాలేజీ కోసం పెద్ది తాపత్రపడ్డారో... ఆ మెడికల్ కాలేజీకి పెద్ది పేరు పెడుతామన్నారు. నర్సంపేట చరిత్రలో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచేలా చేస్తామన్నారు కేటీఆర్. పెద్ది సుదర్శన్ రెడ్డి గొప్ప అభ్యుదయ వాది కీర్తించారు. పెద్ది కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీది అని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో కూడా పెద్ది కుటుంబం వెంట బీఆర్ఎస్ పార్టీ ఉంటుందన్నారు కేటీఆర్. సూర్యచంద్రులు ఉన్నంతకాలం నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చిరస్థాయిగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
