తెలంగాణ

కరెంటు లేక పంటలు ఎండుతుంటే.. విద్యుత్ అమ్ముకుంటారా?

Harish Rao: రేవంత్ సర్కార్ పై మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. మన రాష్ట్రంలో కరెంటు లేదు కానీ.. సింగరేణిలో ఉత్పత్తి అవుతున్న 800 మెగావాట్ల విద్యుత్‌ను రాజస్థాన్‌‌కు అమ్ముతామని జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ ఎందుకు చేసుకున్నారు? అని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు. రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వకుండా పక్క రాష్ట్రానికి ఎందుకు అమ్ముతున్నారు? అని హరీశ్ రావు నిలదీశారు. మీరు చెప్పిందేమో 24 గంటల కరెంటు, కానీ ఇస్తున్నది కేవలం తొమ్మిది గంటలే. అందులోనూ మధ్యమధ్యలో ట్రిప్ అవుతోంది. మెటీరియల్ లేదనే సాకుతో రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను సంవత్సరకాలంగా పెండింగ్ లో పెట్టారు అని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.