క్రీడలు
తిరుమల శ్రీవారి సేవలో హార్దిక్ పాండ్యా.. ప్రియురాలితో కలిసి స్వామివారి దర్శనం.. గుండుతో కొత్త లుక్!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నాడు. తన ప్రియురాలు మహికా శర్మతో కలిసి ఆదివారం వేకువజామునే తిరుమలకు చేరుకున్న పాండ్యా, అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నాడు.
