International
Hamas new leader: హమాస్ నూతన అధినేతగా ఖలీల్ అల్ హయ్యా
ఇజ్రాయెల్ సైన్యంతో జరిగిన ఎదురుకాల్పుల్లో హమాస్ అప్పటి అధినేత యాహ్యా సిన్వర్ 2024 అక్టోబర్లో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొంతకాలం పాటు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కౌన్సిల్ హమాస్ వ్యవహారాలను పర్యవేక్షించింది. తాజాగా నిర్వహించిన అంతర్గత ఎన్నికల ద్వారా 64 ఏళ్ల సీనియర్ నేత ఖలీల్ అల్ హయ్యాను తమ పూర్తిస్థాయి అత్యున్నత నాయకుడిగా హమాస్ అధికారికంగా ఎన్నుకుంది.
