తెలంగాణ
ఖైరతాబాద్ గణేషుడికి గవర్నర్ దంపతుల తొలి పూజ!
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భాగ్యనగర ఆధ్యాత్మిక ప్రతీక, ఖైరతాబాద్‌లో 69 అడుగుల ఎత్తులో కొలువుదీరిన ‘శ్రీ పంచముఖి సంకటహర మహాగణపతి’కి తొలి పూజ అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా దంపతులు వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రథమ పూజ నిర్వహించారు. అంతకుముందు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉత్సవ సమితి సభ్యులు గవర్నర్ దంపతులకు ఘన స్వాగతం పలికి ప్రధాన మండపం వద్దకు గౌరవపూర్వకంగా తీసుకెళ్లారు.
