National
ప్రభుత్వ ఉద్యోగులు జవాబుదారీతనంగా ఉండాలి: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు!
ప్రభుత్వ ఉద్యోగులకు లభిస్తున్న విశేషాధికారాలు, డీఏ బకాయిలు, వారి పనితీరుపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. కార్పొరేట్ లేదా అసంఘటిత రంగాలతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యేక హక్కులు కలిగిన వర్గమని, వారికి వేతనాలతో పాటు డీఏ, అలవెన్సులు, పెన్షన్ వంటి సదుపాయాలు శాశ్వతంగా అందుతాయని కోర్టు గుర్తుచేసింది. ఉద్యోగి మరణానంతరం కూడా వారి కుటుంబ సభ్యులకు పెన్షన్ లభిస్తున్నప్పటికీ, సమాజం పట్ల వారి నుంచి రావాల్సిన బాధ్యత మరియు జవాబుదారీతనం ఏ స్థాయిలో ఉందనేది ఆత్మపరిశీలన చేసుకోవాలని ధర్మాసనం అభిప్రాయపడింది.
