తెలంగాణ

తెలంగాణ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరో కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం!

తెలంగాణ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో చక్కటి శుభవార్త అందింది. దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించే క్రమంలో రైల్వే శాఖ మరో కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ నుంచి తమిళనాడులోని కోయంబత్తూరు వరకు రాకపోకలు సాగించేలా (22363/22364) ఈ కొత్త అమృత్ భారత్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సర్వీసును రైల్వే అధికారులు అధికారికంగా ప్రారంభించారు. ఈ సరికొత్త ఎక్స్‌ప్రెస్ రైలు జార్ఖండ్, బీహార్‌లోని గయా మీదుగా ప్రయాణించి, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి సమీపంలోని రేణిగుంట జంక్షన్ గుండా కోయంబత్తూరు చేరుకుంటుంది.