తెలంగాణ

Good News: ఇందిరమ్మ ఇల్లు దక్కలేదా? అయితే రూ.10వేల డిపాజిట్ వాపస్!

తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ పథకానికి దరఖాస్తు చేసుకుని లాటరీలో ఇళ్లు దక్కించుకోని వేలాది మంది దరఖాస్తుదారులకు రాష్ట్ర హౌసింగ్ బోర్డు తీపి కబురు అందించింది. లాటరీ ప్రక్రియ ద్వారా ఇల్లు పొందని బాధితులకు వారు ప్రారంభంలో చెల్లించిన రూ.10వేల ధరావతు (ఈఎండీ) డిపాజిట్ మొత్తాన్ని బుధవారం(నేడు) నుంచి తిరిగి చెల్లించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ.గౌతమ్ అధికారికంగా వెల్లడించారు. నిధుల వాపస్(Refund) ప్రక్రియ మొత్తాన్ని వారం రోజుల్లోగా సమర్థవంతంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.