వ్యాపారం
Gold, silver price: షాకింగ్.. ఒక్కరోజులోనే రూ.10వేలు పెరిగిన ధర..!
బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి నేడు కోలుకోలేని భారీ షాక్ తగిలింది. దేశీయంగా బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న తీవ్ర పరిణామాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పసిడి ప్రేమికులు, పండుగలు లేదా శుభకార్యాల కోసం ఆభరణాలు కొనాలని భావించిన సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఈ ఆకస్మిక ధరల పెంపుతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ధరల వివరాల్లోకి వెళితే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై ఏకంగా రూ. 2,650 పెరిగింది. ఈ పెంపుతో 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ. 1,37,250కు చేరుకుంది. అదేవిధంగా, మేలిమి బంగారంగా పిలిచే 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 2,890 మేర ఎగబాకింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర మార్కెట్లో ప్రస్తుతం రూ. 1,49,730 వద్ద కొనసాగుతోంది.
