వ్యాపారం

బంగారం ఒకేరోజు రూ.4,000 డౌన్.. దీపావళి నాటికి రూ.లక్ష దిగువకు చేరుతుందా?

 భారతీయ మార్కెట్‌లో ఎప్పుడూ లేనివిధంగా బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. శనివారం ఒక్కరోజే తులం బంగారంపై ఏకంగా రూ.4,000 వరకు ధర తగ్గగా, వెండి ధర సైతం రూ.10,000 వరకు పడిపోయింది. గత కొన్ని నెలలుగా ఆకాశాన్నంటిన పసిడి ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టడం ఆభరణాల కొనుగోలుదారులు, సామాన్యులకు ఎంతో ఊరటనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న ఊహించని పరిణామాలు, ముడిచమురు (క్రూడ్ ఆయిల్) ధరల మందగమనం, అమెరికా డాలర్ బలపడటం వంటి ప్రధాన కారణాల వల్ల బంగారం ధరలు భారీగా దిగివచ్చినట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.