National

గ్యాస్ లీక్.. నాగ్‌పూర్ టు ముంబై రహదారిపై భారీగా నిలిచిన వాహనాలు

దేశంలో మరో విషాదం చోటుచేసుకోకుండా అధికారులు అడ్డుకున్నారు. గ్యాస్ లీకేజీ కావడంతో 24 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ను మళ్లించారు.మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో ఉన్న గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ అయినట్టు సమాచారం. స్థానికులు వెంటనే గమనించి పోలీసులకు సమాచారం అందించగా.. అక్కడకు చేరుకున్న పోలీసులు.. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారులను సంప్రదించి సమాచారం పాస్ చేశారు. అనంతరం ఉన్నతాధికారులకు సైతం ఇన్ఫర్మేషన్ అందించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం పైప్‌లైన్ రెండువైపులా ఉన్న వాల్వ్‌లను మూసివేసేందుకు చర్యలు చేపట్టారు. అందుకోసం నిపుణులను సంప్రదించినట్టు తెలిసింది.