క్రీడలు

ఐపీఎల్ జట్ల పెంపు వార్తలకు ఫుల్‌స్టాప్.. బీసీసీఐ క్లారిటీ!

 ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) జట్ల సంఖ్యను 10 నుంచి 12కు పెంచబోతున్నారంటూ గత రెండు రోజులుగా వస్తున్న ఊహాగానాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పూర్తిస్థాయిలో తెరదించింది. ఐపీఎల్ 2028 మెగా వేలానికి ముందే లీగ్‌ను 12జట్లకు విస్తరిస్తారని, కొత్త ఫ్రాంచైజీల కోసం పుణె, వడోదర నగరాలను బోర్డు పరిశీలిస్తోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) తీవ్రంగా ఖండించారు. అసలు జట్ల సంఖ్యను పెంచే ఆలోచనే తమ వద్ద లేదని ఆయన స్పష్టం చేశారు.