క్రీడలు
భారత్-అఫ్గాన్ మ్యాచ్లో వందేమాతరం పూర్తి గీతం.. వేడెక్కిన రాజకీయాలు!
భారత క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన అధ్యాయానికి తెరలేచింది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు తొలిసారిగా జాతీయ గేయం ‘వందేమాతరం’ పూర్తి గీతాన్ని అధికారికంగా ఆలపించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ ఆరంభానికి ముందు ఈ భావోద్వేగ ఘట్టం చోటుచేసుకుంది. సుమారు 3 నిమిషాల 10 సెకన్ల నిడివి కలిగిన ఆరు చరణాల ‘వందేమాతరం’ పూర్తి గీతాన్ని ఆలపించిన అనంతరం, యథావిధిగా జాతీయ గీతం ‘జనగణమన’ను ప్లే చేశారు.
