National

Flydubai: 180 మందిని కాపాడిన భారత పైలట్..!

Flydubai: ఆకాశంలో వేల అడుగుల ఎత్తున 180 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో కో-పైలట్ ఒక్కసారిగా ఉన్మాదిలా మారాడు. ఒళ్లంతా గాయాలవుతున్నా, చావు అంచుల వరకు వెళ్లినా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఓ భారత కెప్టెన్ చూపిన అసాధారణ తెగువ 180 మంది ప్రయాణికులకు ప్రాణదానం చేసింది. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయల్దేరిన ఫ్లైదుబాయ్ విమానం టేకాఫ్ అయిన సుమారు రెండున్నర గంటల తర్వాత ఈ ఘటన జరిగింది. కాక్‌పిట్ లోపల ఉన్న ఒమన్ జాతీయుడైన కో-పైలట్ అకస్మాత్తుగా తోటి భారత కెప్టెన్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడికి దిగాడు. విమానాన్ని కూల్చేయడమే లక్ష్యంగా అతను దాడికి యత్నించినట్లు స్పష్టమవుతోంది. రక్తమోడుతున్నా సరే ఆ భారత పైలట్ మాత్రం విమానం స్టీరింగ్ వదలకుండా నిలబడటంతో పాటు, ప్రాణాలకు తెగించి ఆ ఉన్మాదిని ఎదుర్కొన్నారు.