International

FlightCancellations: చిన్న సాంకేతిక సమస్య.. ఏకంగా 1,000కి పైగా విమాన సర్వీసులు రద్దు!

 బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో చోటుచేసుకున్న ఊహించని సాంకేతిక లోపం వల్ల దేశవ్యాప్తంగా విమాన రాకపోకలు దారుణంగా స్తంభించిపోయాయి. లండన్ పరిధిలోని గగనతలం తెరిచే ఉన్నప్పటికీ, విమానాల సమన్వయ వ్యవస్థ విఫలం కావడం వల్ల మంగళవారం ఒక్క రోజే వెయ్యికి పైగా విమాన సర్వీసులను ఎయిర్‌లైన్స్ సంస్థలు రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో విమానాశ్రయాల్లోనే వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షిస్తూ తీవ్ర అవస్థలు పడ్డారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (NATS) అధికారులు, ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ యూనిట్‌లో ఏర్పడిన లోపాన్ని సరిదిద్దేందుకు అత్యవసర చర్యలు చేపట్టారు.