International
దమ్మామ్ విమానాశ్రయంపై హౌతీల భీకర దాడి.. భారతీయుడు మృతి!
సౌదీ అరేబియాలోని కీలకమైన దమ్మామ్ అంతర్జాతీయ విమానాశ్రయం (King Fahd International Airport) లక్ష్యంగా యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన క్షిపణి/డ్రోన్ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారిలో ఒకరు సౌదీ పౌరుడు కాగా, మరొకరు భారతీయ జాతీయత కలిగిన వ్యక్తిగా సౌదీ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GACA) అధికారికంగా ధ్రువీకరించింది. ఈ ఘటనతో పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత కొన్ని వారాలుగా సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలు, పౌర విమానాశ్రయాలు, కీలక మౌలిక సదుపాయాలపై హౌతీలు దాడులను క్రమంగా పెంచుతున్నారు.
