National
ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌కు విద్యార్థినుల చుక్కలు..ఎందుకంటే?
‘జెన్ జీ, జెన్ అల్ఫా’ వంటి నేటితరం పిల్లలు, యువకులు ప్రశ్నించడంలో ముందుంటున్నారు. వారికి సమస్య మీద పూర్తిగా అవగాహన ఉన్నా లేకున్నా గట్టిగా నిలదీయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్వాలిటీ, ప్రశ్నించేతత్వం లేకపోవడం వల్లే దేశం,రాష్ట్రాల్లోని వివిధ ప్రభుత్వాలు జవాబుదారీతనం పాటించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పాఠశాలకు వెళ్లేందుకు స్టాప్‌లో ఎదురుచూస్తుండగా బస్సు ఆపలేదని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిగెత్తుకుంటూ వెళ్లి మరి బస్సును ఆపారు. అనంతరం ముగ్గురు విద్యార్థినులు బస్సుకు ఎదురుగా నిలబడి డ్రైవర్, కండక్టర్‌ను నిలదీశారు. బస్సు ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. ఈ కర్ణాటకలోని కొప్పళ తాలూకా బి.హొసహళ్లిలో వెలుగుచూసింది.
