National

FCRA: ఆ కొత్త సవరణ బిల్లుతో భారతీయులకే తీవ్ర నష్టం: శశి థరూర్

కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో పునఃప్రవేశపెట్టిన విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణ బిల్లు-2026 పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విదేశీ నిధుల సమీకరణలో పారదర్శకత పెంచే నెపంతో తీసుకొస్తున్న ఈ సవరణలు, నిజానికి కార్యనిర్వాహక వర్గానికి (ప్రభుత్వానికి) విపరీతమైన, నియంత్రణ లేని చట్టాలను కట్టబెట్టేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ ప్రతిపాదిత మార్పులు పారదర్శకతను పెంచకపోగా, దేశంలోని స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, సామాజిక సేవా రంగాన్ని దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.