క్రైమ్
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం!
తెలంగాణ మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ (OSD) సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం రాత్రి ఆయన ఒకేసారి 40 నిద్రమాత్రలు మింగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని వెంటనే గమనించిన కుటుంబసభ్యులు ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం వరంగల్లోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో సుబ్రహ్మణ్యం పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.
