క్రైమ్

అమ్మాయి పేరిట ఫేక్ అకౌంట్స్. కేటుగాడి వలలో డీసీపీ, సీఐలు, టెకీలు

ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన కె. పవన్ కుమార్ (23)లో హైదరాబాద్‌లో అనేక కంపెనీల్లో ఉద్యోగం చేసి మానేశాడు. ప్రస్తుతం నగరంలోని కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు. ఈజీ మనీ కోసం అమ్మాయిల పేర్లు, ఫోటోలతో ఇన్‌స్టాగ్రామ్‌లో 13, ఫేస్‌బుక్‌లో 14 ఫేక్ అకౌంట్లు సృష్టించి, యువకులు, పురుషులకు తనను తాను అమ్మాయిగా పరిచయం చేసుకునేవాడు.వారి వ్యక్తిగత వివరాలు, న్యూడ్ ఫొటోలను సేకరించాక స్వరం మార్చేవాడు. అమ్మాయి అన్నను అని చెప్పి బెదిరించి డబ్బులు వసూలు చేయడం, మరికొందరి దగ్గర పెట్టుబడుల పేరిట వసూళ్లు చేసినట్టు తెలిసింది.పవన్ బాధితుల్లో సీఐలు, అదనపు డీసీపీలతో సహా 14 మంది పోలీసులు, వైద్యులు, వ్యాపారవేత్తలు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, గిగ్ వర్కర్లు కూడా ఉన్నట్టు తెలిసింది. నాలుగేళ్లలో దాదాపు రూ.26.16 లక్షలు సంపాదించినట్టు పోలీసులు గుర్తించారు.