క్రీడలు
మ్యాచ్ రద్దైనా.. ధోనీ రికార్డును చెరిపేసిన విరాట్ కోహ్లీ!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో అరుదైన మైలురాయి చేరింది. భారత్, న్యూజిలాండ్ మధ్య హామిల్టన్‌లోని సెడ్డన్ పార్క్ వేదికగా జరగాల్సిన మూడో వన్డే మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే పూర్తిగా రద్దయింది. అయినప్పటికీ, టాస్ ముగిసి భారత తుది జట్టును ప్రకటించడంతో విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ద్వారా ఒక విశిష్ట రికార్డును సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్ గడ్డపై అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అధిగమించి కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు.
