వైరల్ న్యూస్

ElephantRescue: మెడకు ట్రాక్టర్ టైరు చిక్కుకుని ఏనుగు విలవిల.. చివరికి ఏం జరిగిందంటే?

 అస్సాంలోని గోలాఘాట్ జిల్లా పరిధిలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఓ ఏనుగు ప్రాణసంకటంలో చిక్కుకుంది. ప్రమాదవశాత్తు దాని మెడకు ఒక పెద్ద ట్రాక్టర్ టైరు బిగుసుకుపోవడంతో సరిగా నడవలేక, కనీసం ఆహారం, నీరు కూడా తీసుకోలేక కొన్ని రోజులుగా తీవ్ర నరకయాతన అనుభవించింది. అడవిలో విలవిలలాడుతున్న ఆ మూగజీవి దీనస్థితిని గమనించిన స్థానికులు వెంటనే సమాచారాన్ని స్థానిక అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.