International
DonaldTrump: నోబెల్ శాంతి బహుమతికి నేనే అర్హుడిని: ట్రంప్
ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి తాను మాత్రమే సంపూర్ణ అర్హుడినని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించడంలో తాను క్రియాశీలక పాత్ర పోషించానని, అందువల్ల ఈ ఏడాది శాంతి బహుమతి తనకే దక్కాలని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, నార్వేజియన్ నోబెల్ కమిటీ తనలాంటి సిద్ధాంతాలు కలిగిన వ్యక్తులకు ఈ బహుమతిని ఇచ్చే అవకాశం చాలా తక్కువని అనుమానం వ్యక్తం చేశారు. వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
