ఏపీ

తిరుమలకు పోటెత్తిన భక్త జనం.. ఒక్కరోజే రూ.4.92 కోట్ల ఆదాయం!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. వారాంతం కావడంతో దేశం నలుమూలల నుంచి వేలాదిగా తరలివస్తున్న భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. రద్దీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో క్యూలైన్లు వెలుపల ఉన్న శిలాతోరణం ప్రాంతం వరకు బారులు తీరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు వెల్లడించారు.