తెలంగాణ
రోడ్డు నిధుల ఆలస్యం.. ఆమరణ దీక్షకు సిద్ధమన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే!
తెలంగాణలోని మానకొండూరు నియోజకవర్గ పరిధిలోని గుండ్లపల్లె నుంచి పొత్తూరు వరకు నిర్మించాల్సిన డబుల్ రోడ్డు పనులు తీవ్రంగా ఆలస్యం కావడంపై స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అసహనాన్ని వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించిన నిధుల విడుదల కోసం తాను చాలా రోజులుగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయకపోతే తన నియోజకవర్గ ప్రజల రవాణా కష్టాలను తీర్చేందుకు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్కు గతంలో చేసిన పనులకు సంబంధించిన పాత బకాయిలు రాకపోవడంతోనే నూతన పనులను ప్రారంభించేందుకు నిరాకరిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
