తెలంగాణ
ఇంజినీరింగ్ క్రేజ్ తగ్గుతోందా? డిగ్రీ వైపు పడుతున్న విద్యార్థుల అడుగులు
మంచి ర్యాంక్ వస్తే ఇంజినీరింగ్ కాలేజీలో సీటు.. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. ఇదే ఒకప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచన. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోందా? ఇంజినీరింగ్ వైపు వెళ్లాల్సిందే అనే ధోరణి క్రమంగా తగ్గుతోందా? తాజా డిగ్రీ ప్రవేశాల గణాంకాలు చూస్తే.. ఈ ప్రశ్న మరోసారి తెరపైకి వస్తోంది.
