క్రైమ్

ఎన్నికల ఫలితాల వేళ తీవ్ర విషాదం.. ఓట్ల లెక్కింపునకు ముందే జనసేన అభ్యర్థి మృతి!

 ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడే కొద్ది గంటల సమయాని కంటే ముందే జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్య(26) అనారోగ్యంతో హఠాన్మరణం చెందింది. ధుమంతునిగూడెం ఎంపీటీసీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె, పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆరంభంలో తీవ్రమైన గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్య తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆమెను తక్షణమే రాజమండ్రిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో దేవరపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.