క్రైమ్
ఫోన్ మాట్లాడొద్దన్నందుకు తండ్రి కళ్లెదుటే కూతురి దారుణం
ఫోన్ ఎక్కువగా మాట్లాడొద్దు అన్నందుకు ఓ బాలిక తల్లిదండ్రులకు దారుణ శిక్ష విధించింది. తండ్రి కళ్ల ముందే రైలు కింద పడి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలోని ఛత్రినాకలో గురువారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. ఛత్రినాకలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ కూతురు తేజస్వి(17) ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. చదువు కోసమని తండ్రి ఆమెకు మొబైల్ ఇప్పించాడు.అయితే, ఈ మధ్య తన కూతురు అర్ధరాత్రి వరకు ఫోన్లో ఎక్కువగా మాట్లాడటం గమనించిన శ్రీనివాస్.. నిన్న మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన తేజస్విని.. అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. అది చూసిన తండ్రి ఆమెను అనుసరించాడు.ఈ క్రమంలోనే ఉప్పుగూడ రైల్వే స్టేషన్ వద్ద తండ్రి కళ్ల ముందే వేగంగా వస్తున్న గూడ్స్ రైలు కిందపడి తేజస్విని ఆత్మహత్యకు పాల్పడింది.
