తెలంగాణ
వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు ముహూర్తం ఖరారు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
తెలంగాణ ప్రభుత్వం రైతులకు కీలక విషయాన్ని తెలిపింది. ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను అక్టోబర్ 15వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD)లో జిల్లాల అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కార్యాచరణను ఖరారు చేశారు.
