దసరా ‘స్పెషల్’ బాదుడు.. 6 రోజులు అదనపు చార్జీల వసూళ్లు!
దసరా పండుగకు సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ మరోసారి బిగ్‌షాక్ ఇచ్చింది. ప్రత్యేక బస్సులు వేశామని నిన్న ప్రకటించిన ఆర్టీసీ..‘స్పెషల్’ పేరిట అదనపు చార్జీల వసూళ్లకు మరోసారి శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వంలో పెద్ద పండుగలకు మాత్రమే అదనపు చార్జీలు వసూలు చేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో చిన్న పండుగలకు కూడా అదనపు చార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి దసరా పండుగ సమయంలో 6 రోజుల పాటు అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు అదనపు చార్జీలు ఉంటాయని తెలిపింది. ఈసారి దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం 7 వేల వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు టీజీఎస్ఆర్టీసీ నిన్న ప్రకటించింది. అయితే, ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో అదనపు చార్జీలు వసూలు చేస్తామని తెలిపింది.
