తెలంగాణ

Dasara Shopping Dull: దసరా వేళ వెలవెలబోతున్న మార్కెట్లు.. జనాల జేబులకు ఏమైంది?

Dasara Shopping Dull: పండుగ వచ్చిందంటే చాలు బట్టల దుకాణాలు, ఎలక్ట్రానిక్ షోరూమ్‌లు, బైక్, కార్ల షోరూమ్‌లు కిటకిటలాడాలి. ముఖ్యంగా తెలంగాణలో అతిపెద్ద పండుగైన దసరా సమయంలో ప్రతి కుటుంబం షాపింగ్‌లతో సందడిగా కనిపించేది. కానీ ఈసారి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఎన్నడూ లేనంతగా మార్కెట్లు వెలవెలబోతున్నాయి. షాపుల్లో బ్రహ్మాండమైన ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, కలర్‌ఫుల్ డెకరేషన్లు పెట్టి పిలుస్తున్నా జనం మాత్రం కొనుగోళ్లు చేయడానికి జంకుతున్నారు. చేతిలో పైసలు లేక, బడ్జెట్ అదుపు తప్పుతుందన్న భయంతో సామాన్యుడి నుంచి మధ్యతరగతి వరకు ప్రతి ఒక్కరూ ఆచితూచి అడుగులేస్తున్నారు.