తెలంగాణ
దసరా కానుక.. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు
ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక అందించింది. పండుగ నేపథ్యంలో ముందుగా ప్రకటించిన విధంగా వారికి రెండు డీఏలు (కరువు భత్యం) మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 1న జరిగిన మంత్రివర్గ సమావేశంలో రెండు డీఏలు చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.తాజాగా దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. డీఏల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.2,500 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. పెరిగిన కరువు భత్యం జనవరి 2024 నుంచి అమలు కానుంది.
