సినిమా
Dancer Raju Case : ఢీ షో రాజు కేసులో అసలు నిజాలేంటి.. రూ.12 లక్షలు ఎందుకు తీసుకున్నాడు..?
Dancer Raju Case : ‘ఢీ’ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న డాన్సర్ రాజు అసలు రంగు బయటపడింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతిని శారీరకంగా వాడుకోవడమే కాకుండా లక్షలాది రూపాయలు కాజేసిన వ్యవహారంలో అతడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. హైదరాబాద్ మియాపూర్ పరిధిలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మియాపూర్ గోకుల్ ప్లాట్స్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో ఆరో అంతస్తులో 28 ఏళ్ల యువతి బొటిక్ నడుపుతోంది. అదే భవనంలోని మూడో అంతస్తులో ‘ఢీ’ ఫేమ్ చిట్టి మాస్టర్ నిర్వహిస్తున్న డాన్స్ స్టూడియో ఉంది. ఈ స్టూడియోకు ‘ఢీ’ సీజన్-10 విన్నర్ అయిన రాజు రోజు ప్రాక్టీస్ కోసం వచ్చేవాడు.
