National

Covid 19 New Variant: కరోనా మళ్లీ వణికిస్తోందా? ఈసారి వ్యాక్సిన్లకూ చిక్కనంత డేంజరా?

Covid 19 New Variant: ప్రపంచ దేశాలను మరోసారి కరోనా గుబులు వెంటాడుతోంది. అంతా సద్దుమణిగిపోయింది, ఇక వైరస్ భయం లేదని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. వెన్నులో వణుకు పుట్టించేలా మరో కొత్త కోవిడ్-19 వేరియంట్ తెరపైకి వచ్చింది. సాధారణ రకాలతో పోలిస్తే ఈ కొత్త వేరియంట్ అత్యధిక సంఖ్యలో మ్యూటేషన్లకు గురైన 'స్పైక్ ప్రోటీన్'ను కలిగి ఉండటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో ఈ కొత్త రకం కేసులు బయటపడుతుండటంతో అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి.