తెలంగాణ
CornPriceRecord: మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్.. మార్కెట్లో రికార్డు స్థాయి ధర!
తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న (మక్కలు) సాగు చేసిన అన్నదాతల శ్రమకు తగిన ఫలితం దక్కుతోంది. బహిరంగ మార్కెట్లో మక్కలకు అనూహ్య రీతిలో డిమాండ్ పెరగడంతో ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఆసియాలోనే అతిపెద్ద ధాన్యాల విక్రయ కేంద్రాల్లో ఒకటిగా పేరుగాంచిన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో క్వింటా మొక్కజొన్న ఏకంగా రూ.2,775రికార్డు ధరకు అమ్ముడైంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) రూ.2,400కంటే క్వింటాలుకు రూ.375కు పైగా అదనంగా పలుకుతుండటంతో రైతాంగంలో తీవ్ర ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
