తెలంగాణ

నేడు ‘కామన్ టికెట్’ ప్రారంభం.. ఒకే ధరకు రెండు ప్రయాణాలు

‘క్యూర్’ పరిధిలో నేటి నుంచి కామన్ టికెట్ అందుబాటులోకి రానుంది. ప్రయాణిలకు మెరుగైన రవాణా కోసం ‘మీ టికెట్’ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టడంతో పాటు హైదరాబాద్ మెట్రో భాగస్వామ్యంతో రోజువారీ, నెలవారీ కామన్ పాస్‌ను టీజీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రగతి భవన్‌లో ఇవాళ ప్రారంభించనున్నారు. ఆర్టీసీ బస్సు, మెట్రో సేవలను అనుసంధానించే ఉమ్మడి ప్రయాణ సౌకర్యం కోసం డిజిటల్ పాస్‌ను తీసుకురానున్నారు. హైదరాబాద్‌లో టీజీఎస్‌ఆర్టీసీ రోజుకు సుమారు 25 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నది. మెట్రో రైల్ మూడు కారిడార్లలో రోజుకు సుమారు 4.50 లక్షల మందిని చేరవేస్తోంది. ఈ క్రమంలోనే ఈ రెండు సేవలను మరింత సులభతరంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘కామన్ టికెట్’ను ఉమ్మడి పాస్‌ను తీసుకురానుంది.