వైరల్ న్యూస్
రేసింగ్ ట్రాక్‌పై సీఎం విజయ్, అజిత్ సర్‌ప్రైజ్.. ఫొటోలు వైరల్!
తమిళ సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా అగ్ర కథానాయకులుగా వెలుగొందుతున్న హీరో అజిత్ కుమార్, తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ మధ్య జరిగిన అరుదైన ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. బ్రిటన్‌లోని ప్రఖ్యాత 'సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్' వేదికగా వీరిద్దరూ కలుసుకోవడం తమిళ నాట, క్రీడా, సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తించింది. ఒకే వేదికపై ఇద్దరు దిగ్గజాలు నవ్వుతూ కనిపించడం అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది.
