తెలంగాణ

ఆదిలాబాద్‌ రిమ్స్‌ అగ్నిప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. సమగ్ర విచారణకు ఆదేశం!

 ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ (SNCU) వార్డులో సంభవించిన తీవ్ర అగ్నిప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పసిపాపలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన సీఎం.. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.